స్వరాష్ట్రం చేరుకున్న మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపిన సుజనాచౌదరి

08-01-2020 Wed 15:08
  • 2018 నవంబరులో పాక్ జలాలలో అరెస్ట్ 
  • పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులు 
  • మోదీకి, సుబ్రహ్మణ్యం జైశంకర్ కి ధన్యవాదాలు

ఏడాదికి పైబడి పాకిస్థాన్ లోని జైల్లో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఇరవై మంది మూడు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందిస్తూ, ప్రధాని మోదీకి, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కి ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల విడుదలకు వీరు ఎంతో కృషి చేశారని అన్నారు. స్వదేశానికి చేరుకున్న మత్స్యకారులకు, వారి కుటుంబ సభ్యులకు సుజనా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు.

కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్ లోని వీరావల్ లోని చేపల వ్యాపారుల వద్ద పని చేస్తుంటారు. చేపల వేటలో భాగంగా 2018 నవంబరులో వీరావల్ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన వీరు పొరపాటున పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో, ఆ దేశ భద్రతా సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుంది.