సీఎం జగన్ తో డీజీపీ సవాంగ్ భేటీ

08-01-2020 Wed 14:48
  • తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • శాంతి భద్రతల అంశంపై చర్చించినట్టు సమాచారం
  • నిన్న ఎమ్మెల్యేలపై దాడికి యత్నించిన ఘటనలపై జగన్ కు వివరణ

ఏపీ రాజధాని అమరావతిని తరలించవద్దంటూ కొన్ని రోజులుగా రైతుల ఆందోళన సాగుతోంది. ఇందులో భాగంగా నిన్న రైతులు చేపట్టిన రహదారుల దిగ్బంధం ఉద్రిక్తంగా మారడం, వైసీపీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశం గురించి చర్చించినట్టు సమాచారం. శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలపై దాడికి యత్నించిన ఘటనలకు సంబంధించి లభ్యమైన ఆధారాలు, పోలీసులు తీసుకున్న చర్యల గురించి జగన్ కు సవాంగ్ వివరించినట్టు సమాచారం.