Pakistan: పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

  • పాక్ జైళ్లలో ఏడాదికిపైగా మగ్గిన తెలుగు జాలర్లు
  • వైసీపీ ఎంపీల పోరాటంతో విదేశాంగ శాఖ చర్యలు
  • కొన్నిరోజుల క్రితమే మత్స్యకారులను విడుదల చేసిన పాక్
  • వాఘా బోర్డర్ నుంచి తోడ్కొని వచ్చిన మంత్రి మోపిదేవి

దాదాపు 14 నెలల పాటు పాకిస్థాన్ జైళ్లలో మగ్గిన ఏపీ మత్స్యకారులు ఎట్టకేలకు సొంతగడ్డపై అడుగుపెట్టారు. వైసీపీ ఎంపీల పోరాటం ఫలితంగా విదేశాంగ శాఖ చొరవ తీసుకోవడంతో 20 మంది తెలుగు మత్స్యకారులను పాకిస్థాన్ విడిచిపెట్టింది. వారిని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వయంగా వాఘా బోర్డర్ నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఆ మత్స్యకారులు నేడు సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారికి జగన్ మిఠాయిలు తినిపించారు. అంతేకాదు, ఒక్కొక్క మత్స్యకారుడికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం కూడా ప్రకటించారు. జగన్ నిర్ణయంతో జాలర్లు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News