ఇదేం పౌరుషం.. ఇదేం ఉద్యమం?: వాసిరెడ్డి పద్మ

08-01-2020 Wed 14:35
  • మహిళలను వాడుకుని లబ్ధి పొందాలనుకుంటున్నారు
  • మహిళలు అరెస్ట్ అయ్యేలా  చేస్తున్నారు
  • పదవులు అనుభవించినవారు ఎందుకు అరెస్ట్ కావడం లేదు?

అమరావతి రైతుల ఆందోళనలపై వైసీపీ నాయకురాలు, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఉద్యమంలో మహిళలను వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మహిళలను రోడ్లపైకి తీసుకొచ్చి, వారు అరెస్ట్ అయ్యేలా చేస్తున్నారని అన్నారు. ఇదేం పౌరుషం, ఇదేం ఉద్యమమని ఎద్దేవా చేశారు. విజయవాడలో సమ్మె చేసే సత్తా లేనివారు... మహిళలను రోడ్లపైకి తీసుకొచ్చారని విమర్శించారు. అమాయకులు అరెస్ట్ అవుతున్నారని... గతంలో పదవులను అనుభవించినవారు ఎందుకు అరెస్ట్ కావడం లేదని ప్రశ్నించారు. ఇవన్నీ నీచ రాజకీయాలని మండిపడ్డారు.