రంగులు వేసుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: నాదెండ్ల మనోహర్

08-01-2020 Wed 14:25
  • జగన్ అధికారమదంతో వ్యవహరిస్తున్నారు
  • స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చాలనుకుంటున్నారు
  • జగన్ ది విభజించు, పాలించు అనే దురాలోచన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారమదంతో వ్యవహరిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్... అధికారంలోకి రాగానే మాట తప్పారని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధానిని తరలించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధానిని మార్చేస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని రైతులతో చర్చించకుండా ఏకపక్షంగా రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నించారు.

ఒక ప్రాంత ప్రజల పొట్టకొట్టి... మరో ప్రాంత ప్రజల కడుపు నింపుతారా? అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ ది విభజించు, పాలించు అనే దురాలోచన అని విమర్శించారు. ఏడు నెలల పాలనలో రంగులు వేసుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.