ఉత్తరాంధ్ర యువతకి వచ్చే ఉద్యోగాలను కాలితో తన్నేశారు: జగన్‌పై లోకేశ్‌ విమర్శలు

08-01-2020 Wed 13:32
  • మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తావిస్తూ ట్వీట్లు 
  • విశాఖలో ఉన్న కంపెనీలను ఖాళీ చేయించారు
  • కొత్తగా వస్తాం అన్న కంపెనీలను తరిమేశారు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. 'విశాఖలో ఉన్న కంపెనీలను ఖాళీ చేయించారు, కొత్తగా వస్తాం అన్న కంపెనీలను తరిమేశారు. ఉత్తరాంధ్ర యువతకి వచ్చే ఉద్యోగాలను కాలితో తన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నాను అని జగన్ గారు చెప్పడం మసి పూసి మారేడు కాయని చెయ్యడమే' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'అమరావతిలో చంద్రబాబుగారు నిర్మించిన భవనాల్లో ఉండటానికి జగన్ గారు ఇష్టపడటం లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబుగారు ఏర్పాటు చేసిన భవనాల్లో కంపెనీలు ఖాళీ చేయించి అక్కడే కూర్చుంటాను అని జగన్ గారు అంటున్నారు' అని లోకేశ్ విమర్శించారు.