బేగంపేటలోని యూఎస్‌ కాన్సులేట్‌కు భద్రత పెంపు

08-01-2020 Wed 13:26
  • కార్యాలయానికి వస్తోన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తోన్న పోలీసులు
  • బేగంపేటలో భారీగా ట్రాఫిక్‌ జామ్ 
  • వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు 

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఆ కార్యాలయానికి వస్తోన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు.

ఆ కార్యాలయం వద్ద భారీ భద్రత నేపథ్యంలో బేగంపేటలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. భారత్‌లోని పలు ప్రాంతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు.