సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ ఒక రేంజ్ లో వుంటుందట!

08-01-2020 Wed 13:07
  • కీలకమైన పాత్రలో విజయశాంతి 
  • ప్రత్యేకమైన పాత్రలో కృష్ణ 
  • స్పెషల్ సాంగులో మెరవనున్న తమన్నా

వెండితెరపై సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన కృష్ణ, వయసు పైబడిన కారణంగా కొంతకాలంగా సినిమాలకి దూరంగా వుంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో నటించినట్టు దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. అప్పటి నుంచి కృష్ణ ఏ పాత్రలో కనిపించనున్నారు? ఆయన పాత్ర ఎప్పుడు ఎలాంటి సందర్భంలో ఎంట్రీ ఇస్తుంది? అనే ఆసక్తి అభిమానులలో పెరిగిపోతోంది.

కృష్ణ ఎంట్రీ సెకండాఫ్ లో ఉంటుందనేది తాజా సమాచారం. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా ఆయన కనిపిస్తారని అంటున్నారు. కృష్ణ ఎంట్రీ సీన్ ఒక రేంజ్ లో ఉంటుందనీ, ఆయన క్రేజ్ కి తగిన విధంగా ఉంటుందని చెబుతున్నారు. కీలకమైన పాత్రతో విజయశాంతి రీ ఎంట్రీ .. ప్రత్యేక పాత్రలో కృష్ణ కనిపించనుండటం .. ప్రత్యేక గీతంలో తమన్నా మెరవనుండటం ఈ సినిమా హైలైట్స్ గా కనిపిస్తున్నాయి.