అమ్మ ఒడిని మరిపించే ఊయల.. అమెరికా కంపెనీ ఆవిష్కరణ

08-01-2020 Wed 13:06
  • కారులో కూడా తీసుకువెళ్లే సౌలభ్యం 
  • పిల్లల్ని ఈజీగా పడుకోబెడుతుందంటున్న సంస్థ 
  • సీఈఎస్ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణ

అమ్మ ఒడి చల్లని ఓదార్పు. అందుకే ఆ ఒడిలో బిడ్డ ప్రశాంతంగా సేదదీరుతుంది. ఏడ్చే పిల్లాడిని అమ్మ వద్ద చేరిస్తే క్షణాల్లో ఏడుపు మాయం కావడానికి అమ్మఒడిలో లభించే ఓదార్పే కారణం. అందుకే అమ్మఒడిలాంటి ఓదార్పు లభించే ఊయల తయారు చేసింది అమెరికాకు చెందిన 4మామ్స్ కంపెనీ. 

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2020 (సీఈఎస్)లో ఈ సంస్థ దీన్ని ప్రదర్శనకు ఉంచింది. బిడ్డను ఓదార్చేందుకు తల్లి ఏ విధంగా అయితే తన చేతుల్లోకి తీసుకుని ఆడిస్తుందో అటువంటి అనుభూతినే ఈ ఊయల కలిగిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4మామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, దానితో ఈ ఊయలను అనుసంధానిస్తే ఎక్కడ నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చని తెలిపింది.