జగన్ గారు చేతగాని వాడు అని విజయసాయిరెడ్డి చాటింపు వేసి చెబుతున్నారు: బుద్ధా వెంకన్న

08-01-2020 Wed 12:57
  • అమరావతిని చంపడానికి మీరు ప్రయత్నిస్తున్నారు
  • మీరు, జగన్ గారు చేసిన ఆరోపణలలో ఒక్కటైనా నిరూపించారా?
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు.. ఒక్క ఆధారమైనా చూపించారా?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 'విజయసాయిరెడ్డి గారు.. ముఖ్యమంత్రి జగన్ గారు చేతగాని వాడు అని మీరే ప్రపంచానికి చాటింపు వేసి మరీ చెబుతున్నారు. అమరావతిని చంపడానికి మీరు, జగన్ గారు చేసిన ఆరోపణలు ఒక్కటైనా నిరూపించారా? ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు ఒక్క ఆధారమైనా చూపించారా?' అని ప్రశ్నించారు.

'మగాడిలా చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు. సవాలు స్వీకరించే దమ్ము మీకు లేదు. జ్యూడిషియల్ విచారణ చేసే సత్తా లేదు ట్విట్టర్ లో విసుర్లు ఎందుకు సాయి రెడ్డి గారు? డైరెక్ట్ గా చర్చించుకుందాం రా.. బినామీలు, సొంత మనుషులు కథ ఏంటో తేల్చుకుందాం' అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా సవాలు విసిరారు.