80 మంది అమెరికా టెర్రరిస్టులను చంపేశాం: ఇరాన్ ప్రకటన

08-01-2020 Wed 12:12
  • అమెరికా స్థావరాలపై 15 మిస్సైళ్లతో దాడి చేశాం
  • హెలికాప్టర్లు, మిలిటరీ పరికరాలను ధ్వంసం చేశాం
  • మాకు మరో 100 టార్గెట్ లు సిద్ధంగా ఉన్నాయి

ఇరాక్ లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై 15 మిస్సైళ్లతో దాడి చేశామని... ఈ దాడుల్లో కనీసం 80 మంది అమెరికా టెర్రరిస్టులు హతమయ్యారని ఇరాన్ అధికార టీవీ ఛానల్ ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా వెనకడుగు వేయకపోతే... తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతానికి అమెరికాకు చెందిన రెండు స్థావరాలపైనే దాడి చేశామని... తమకు మరో 100 టార్గెట్ లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. తాము జరిపిన తాజా దాడిలో అమెరికాకు చెందిన హెలికాప్టర్లు, భారీ ఎత్తున మిలిటరీ పరికరాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది.