గుంటూరు జైలులో వున్న రైతులను పరామర్శించిన నారా లోకేశ్

08-01-2020 Wed 12:40
  • లోకేశ్‌ వెంట ఎంపీ గల్లా, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి 
  • మీడియాపై దాడి కేసులో పలువురు రైతుల అరెస్టు 
  • జైలులో ఉన్న రైతులు

టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈ రోజు గుంటూరు జిల్లా కారాగారానికి వెళ్లారు. ఆయన వెంట ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్‌ కుమార్‌, జీవీ ఆంజనేయులు కూడా ఉన్నారు.  

మీడియాపై దాడి కేసులో పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేయడంతో వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు టీడీపీ నేతలు అక్కడకు వెళ్లారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వారిని పరామర్శించిన విషయం తెలిసిందే. మరోవైపు, మందడం, తుళ్లూరు ప్రాంతాల్లో రైతులు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు.