చిరూ .. కొరటాల మూవీలో చరణ్?

08-01-2020 Wed 11:31
  • కొరటాలతో సెట్స్ పైకి వెళ్లిన చిరూ 
  • తన ముచ్చట తీర్చుకోనున్న కొరటాల 
  • ఆగస్టు 14వ తేదీన విడుదల చేసే ఆలోచన

చిరంజీవి .. కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కనిపించనున్నాడనే టాక్ నిన్నటి నుంచి బలంగా వినిపిస్తోంది. చిరంజీవి .. చరణ్ కలిసి కనిపించడం ఉండదట. చిరంజీవి యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో బిజీగా వున్న చరణ్, ఆ సినిమాలో తన పోర్షన్ షూటింగు పూర్తయిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడని చెబుతున్నారు.

గతంలో చరణ్ తో సినిమా చేయాలని కొరటాల చేసిన ప్రయత్నాలు కొన్ని కారణాల వలన కుదరలేదు. అందువల్లనే చిరంజీవి యువకుడిగా వున్నప్పటి పాత్రను చరణ్ తో చేయిస్తే తన ముచ్చట కూడా తీరుతుందనే ఉద్దేశంతో కొరటాల ఇలా సెట్ చేశాడని అంటున్నారు. చిరంజీవి సరసన నాయికగా 'త్రిష' పేరు వినిపిస్తోంది. మ్యాట్నీ సంస్థవారితో కలిసి చరణ్ నిర్మించే ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.