TGvenkatesh: అమరావతిలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి: బీజేపీ ఎంపీ టి.జి.వెంకటేశ్

  • అభివృద్ధి వికేంద్రీకరణ సక్రమంగా జరగాలి 
  • అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి 
  • హైకోర్టుతో ఒరిగేది ఏమీలేకున్నా కొంత సంతృప్తి

వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమోషనల్ గా కాకుండా ప్రశాంతంగా రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, రాయలసీమ నాయకుడు టి.జి.వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఆయన ఓ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ రాజధాని తరలింపు అని కొందరు రెచ్చగొడుతుండడాన్ని తప్పుపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు కావున రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఒకేలా అభివృద్ధి చేయాలని సూచించారు.

విశాఖను రాజధానిగా చేస్తే అమరావతిలో మినీ సెక్రటేరియట్ నిర్మించాలని సూచించారు. హైకోర్టు వల్ల రాయలసీమకు ప్రత్యేకంగా ఒరిగిపోయింది ఏమీలేకున్నా కొంతలో కొంత సంతృప్తి అన్నారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుచేసి అమరావతి, ఉత్తరాంధ్రలో బెంచ్ లు ఏర్పాటు చేయలని కోరారు.

మూడు రాజధానుల వల్ల సర్వం కోల్పోతామన్న భయం రైతుల్లో ఉందని ఆ భయం పోగొట్టే చర్యలు చేపట్టాలని సూచించారు. విశాఖలో రాజధాని పెడితే సీమకు దూరమవుతుందని, అందువల్ల సీమలోనే రాజధాని ఏర్పాటుచేస్తే ఇంకా బాగుంటుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ డిమాండ్ అని, తమ స్టాండ్ ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు.

More Telugu News