రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది.. ఆందోళనతో రైతు కృపానందం మృతి చెందారు: లోకేశ్

08-01-2020 Wed 10:49
  • జగన్ గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు
  • వైకాపా నాయకులు రైతులను అవమానిస్తున్నారు
  • వారి మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి

జగన్ గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోందని ఆయన అన్నారు. కృష్ణాయపాలెంలో ఆందోళనతో రైతు కృపానందం మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
'వైకాపా నాయకులు రైతులను అవమానిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధానిపై ప్రభుత్వం పునరాలోచించడం మంచిది' అని నారా లోకేశ్ మరో ట్వీట్‌లో ప్రభుత్వానికి సూచన చేశారు.