రష్మిక కంటే విజయశాంతికే ఎక్కువ పారితోషికం ముట్టిందట!

08-01-2020 Wed 10:38
  • కథానాయికగా రష్మిక 
  • కీలకమైన పాత్రలో విజయశాంతి 
  • జనవరి 11వ తేదీన విడుదల 

మహేశ్ బాబు అభిమానులంతా ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. జనవరి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక అలరించనుండగా, కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకిగాను రష్మికకి ఎంత పారితోషికం ఇచ్చి వుంటారు .. విజయశాంతికి ఎంత ఇచ్చి వుంటారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.

రష్మికకి కోటి రూపాయలు ఇవ్వగా, విజయశాంతికి కోటిన్నర ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. విజయశాంతి రెండున్నర కోట్ల వరకూ అడిగిందట. అయితే రిక్వెస్ట్ చేయడంతో ఆమె కోటిన్నరకి ఓకే చెప్పారట. పెద్ద బ్యానర్ .. స్టార్ హీరో .. కీలకమైన పాత్ర .. తన రీ ఎంట్రీ ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజయశాంతి తన పారితోషికాన్ని తగ్గించుకున్నారని అంటున్నారు. ఎంత తగ్గించుకున్నా హీరోయిన్ కన్నా ఎక్కువ పుచ్చుకోవడమే ఇక్కడ విశేషం.