హైటెక్ సిటీ- అమీర్‌పేట మార్గంలో నిలిచిన మెట్రో రైళ్లు

08-01-2020 Wed 10:31
  • సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం
  • గంట నుంచి నిలిచిన సేవలు
  • ప్రయాణికులతో కిక్కిరిసిన అమీర్‌పేట మెట్రో స్టేషన్‌

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ- అమీర్‌పేట మార్గంలో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతోనే రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు వివరించారు. ఈ రోజు ఉదయం నుంచి ప్రయాణికులతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కిక్కిరిసిపోయింది. గంట నుంచి మెట్రో రైళ్ల సేవలు నిలిచిపోవడంతో మెట్రో స్టేషన్‌లోనే ప్రయాణికులు ఉన్నారు.

హైటెక్ సిటీ- అమీర్‌పేట మధ్య మెట్రో సేవలను వినియోగించుకోవాలనుకున్న ప్రయాణికులు మెట్రో  స్టేషన్‌లకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు నిలిచిన విషయాన్ని తెలుసుకున్న కొందరు ప్రయాణికులు అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్తున్నారు. లోపాలను సరిచేసిన తర్వాత తిరిగి మెట్రో సేవలు కొనసాగే అవకాశం ఉంది.