Amaravati: జగన్ కాన్వాయ్ వెళ్లాకే భోజనాలు... మందడం గ్రామ ప్రజలపై పోలీసుల ఆంక్షలు!

  • పోలీసుల అధీనంలో రహదారులు
  • షాపులన్నీ మూసివేత
  • హోటల్స్ కూడా తెరవనీయడం లేదని ఆరోపణలు

నేడు సీఎం జగన్ అమరావతికి రానున్న నేపథ్యంలో అమరావతి గ్రామాలపై, ముఖ్యంగా మందడం గ్రామంలో పోలీసులు తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్న పోలీసులు, దుకాణాలను అన్నింటినీ మూసివేయిస్తున్నారు. మెడికల్ షాపులు మినహా మరేమీ తెరచేందుకు వీల్లేదన్న ఆజ్ఞలు జారీ అయ్యాయి.

కాగా, జగన్ సచివాలయానికి వెళ్లిన తరువాతనే భోజనాలు చేయాలని పోలీసులు చెబుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. హోటళ్లను తెరవనీయడం లేదని అంటున్నారు. ఐడీ, ఆధార్ కార్డులను తనిఖీలు చేస్తున్నారని అంటున్నారు. కాగా, ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గం కావడంతోనే మందడం ప్రధాన రహదారిని తమ అధీనంలో ఉంచుకోవాల్సి వస్తోందని, ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆంక్షలను అమలు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.

More Telugu News