Chirutha: కర్నూలు జిల్లాలో కలకలం రేపిన చిరుత!

  • ప్రజల కంటిమీద కునుకు కరవు
  • ఆందోళన చెందుతున్నామంటున్న ప్రజలు
  • పట్టుకుంటామని అటవీ అధికారుల వెల్లడి

కర్నూలు జిల్లాలో ఓ చిరుత పులి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లా పరిధిలోని పత్తికొండ శివారు ప్రాంతాల్లో ఈ చిరుత నిత్యమూ కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. ఉదయాన్నే పొలాలకు వెళుతున్న వేళ, చిరుత సంచరిస్తోందని, దీంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నామని వారు అంటున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణం స్పందించి, చిరుతను బంధించాలని, తమకు మనశ్శాంతిని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ చిరుత నల్లమల అడవుల నుంచి బయటకు వచ్చి, గ్రామాల్లో సంచరిస్తోందని, త్వరలోనే దీన్ని పట్టుకుని, తిరిగి అడవుల్లో వదిలి పెడతామని అధికారులు తెలిపారు. 

More Telugu News