బ్రేకింగ్: 180 మందితో వెళుతూ, ఇరాన్ లో కూలిన ఉక్రెయిన్ విమానం!

08-01-2020 Wed 09:26
  • టెహ్రాన్ సమీపంలో కూలిన విమానం
  • అమెరికా పనేనన్న ఇరాన్
  • తమకు సంబంధం లేదన్న అమెరికా

180 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న ఉక్రెయిన్ కు చెందిన విమానం టెహ్రాన్ సమీపంలో కుప్పకూలిందని ఇరాన్ అధికార టెలివిజన్ బ్రేకింగ్ న్యూస్ ను ప్రసారం చేస్తోంది. ఈ విమానాన్ని అమెరికానే కూల్చి వేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా కావాలనే యుద్ధాన్ని కోరుకుంటోందని, ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తుందని ఇరాన్ హెచ్చరించింది. కాగా, ఈ విమానం కూలడానికి తమకు సంబంధం లేదని, తమ రాడార్లు విమానం గమనాన్ని విశ్లేషిస్తున్నాయని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. మరింత సమాచారం వెలువడాల్సి వుంది.