ఇది ప్రజల కర్మ కాకపోతే మరేంటి?: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి మండిపాటు

08-01-2020 Wed 09:02
  • అమరావతిపై యువత పోరాడాలన్న చంద్రబాబు
  • మీ ఆస్తుల కోసం ప్రజలు సమిధలు కావాలా?
  • ట్విట్టర్ లో మండిపడిన విజయసాయి

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని, అమరావతిని తీసేస్తే, యువత ఆందోళనలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "అమరావతిని రక్షించుకోలేకపోతే చనిపోయినట్టేనట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?" అని ఆయన అన్నారు.