సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

08-01-2020 Wed 07:17
  • మహేశ్ ని విసిగించిన రష్మిక 
  • నానికి అన్నయ్యగా జగపతిబాబు 
  • అనంతపురంలో వెంకటేశ్ షూటింగ్

 *  'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూటింగ్ సందర్భంగా మహేశ్ బాబుని తెగ విసిగించేదాన్నని చెప్పింది కథానాయిక రష్మిక. 'ఈ షూటింగులో ప్రతి విషయానికీ మహేశ్ ని బాగా విసిగించేదానిని. అది చూసి అందరూ ఇబ్బందిపడినా మహేశ్ మాత్రం..పాపం, చిన్న పిల్ల అల్లరి చేస్తోంది, వదిలేయండి.. అంటూ వాళ్లకు చెప్పేవారు. ఆ షూటింగ్ ఓ మధురానుభూతి' అని చెప్పింది.
*  ప్రముఖ నటుడు జగపతిబాబు యంగ్ హీరో నానికి అన్నయ్యగా నటించనున్నారు. శివనిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా 'టక్ జగదీశ్' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో కీలకమైన హీరోకి అన్నయ్య పాత్రలో జగపతిబాబును తీసుకున్నారు.
*  తమిళంలో హిట్టయిన 'అసురన్' చిత్రాన్ని వెంకటేశ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగాన్ని అనంతపురం పరిసరాల్లో నిర్వహిస్తారు. ఈ నెల 20  నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.