నెల్లూరు-పూతలపట్టు రహదారిపై రెండు బస్సుల ఢీ

08-01-2020 Wed 07:00
  • కాశిపెంట్ల వద్ద రెండు బస్సులు ఢీ
  • ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్
  • 36 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

నెల్లూరు-పూతలపట్టు రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, నెల్లూరు-పూతలపట్టు రహదారిపై కాశిపెంట్ల వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.