పాటియాలా హౌస్ కోర్టు తీర్పుపై విజయశాంతి భావోద్వేగ పోస్టు

08-01-2020 Wed 06:49
  • నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీచేసిన కోర్టు
  • దేశంలో న్యాయం, దైవం ఉన్నాయని నమ్మకం కలిగించింది
  • స్త్రీమూర్తి మనస్ఫూర్తిగా అభినందించే శిక్ష

నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరితీయాలంటూ పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును, దిశ ఘటనలో ప్రకృతి విధించిన శిక్షలు రెండింటినీ స్త్రీమూర్తి మనస్ఫూర్తిగా అభినందించదగ్గవేనన్నారు. దేశంలో న్యాయం, దైవం రెండూ ఉన్నాయని నమ్మకం కలిగించేవేనని పేర్కొన్నారు.

ఆడబిడ్డలు, బిడ్డల తల్లులు క్షేమంగా, ధైర్యంగా బతికే సమాజం కోసం ప్రతి భారతీయ హృదయం నిజాయతీగా తల్లడిల్లుతోందన్నారు. వ్యవస్థలను విశ్వసిస్తూ.. పంచుకుంటున్న ఉద్వేగపూరిత అభిప్రాయం ఇదని విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.