జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు కూడు తిన్నారు..: నారా లోకేశ్ ఫైర్

07-01-2020 Tue 21:33
  • మేము ఏం తప్పు చేయలేదు
  • మాపై ఒక్క కేసు కూడా లేదు
  • రైతుల కోసం మేము పోరాడుతుంటే, తీసుకొచ్చి లోపలేశారు

‘జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు కూడు తిన్నారు. పోలీసు భద్రతతో దర్జాగా అటూఇటూ తిరుగుతున్నాడు’ అంటూ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. తోట్లవల్లూరులో పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘మేము ఏం తప్పు చేయలేదు. మాపై ఒక్క కేసు కూడా లేదు. రైతుల కోసం మేము పోరాడుతుంటే, తీసుకొచ్చి లోపలేశారు’ అని, ఇది ఎంత వరకు న్యాయమో వాళ్లు కూడా ఆలోచించాలంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా తమ హయాంలో పాలన గురించి చెప్పారు. ‘విజన్ 2020-2029’ను చంద్రబాబు తీసుకొచ్చారని, ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు రావాలో తాము ఎప్పుడో చెప్పామని అన్నారు. అందుకే, తమ హయాంలో విశాఖకు ఐటీ, చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్ ను తీసుకొచ్చామని చెప్పారు.