ఏ సెక్షన్ కింద అరెస్టు చేశారో చెప్పమంటే పోలీసులు చెప్పరే!: నారా లోకేశ్

07-01-2020 Tue 20:50
  • సంతకం చేసేందుకు ఏ ఒక్క కాగితం ఇవ్వలేదు
  • ‘ఎందుకు తీసుకొచ్చారు?’ అంటే మాట్లాడరు
  • రైతుల పక్షాన పోరాడటమే మేము చేసిన తప్పా?

ఏ సెక్షన్ కింద తమను అరెస్ట్ చేశారో చెప్పమని ప్రశ్నిస్తే పోలీసులు చెప్పలేదని, సంతకం చేసేందుకు ఏ ఒక్క కాగితం ఇవ్వలేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ఎందుకు తీసుకొచ్చారు?’ అని పోలీసులను ప్రశ్నిస్తే వారి వద్ద సమాధానం లేదని, ‘ఇప్పుడు మీరు వెళ్లొచ్చు సార్’ అని అన్నారే తప్ప జవాబు చెప్పలేదని విమర్శించారు. రైతుల పక్షాన పోరాడటం తాము చేసిన తప్పా? ఏ తప్పు చేయని తమను ఎందుకు అరెస్ట్ చేశారు? అంటూ ధ్వజమెత్తారు.