మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు.. ఫేస్ బుక్ లో నేనే నంబర్ 1: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

07-01-2020 Tue 20:46
  • ఓ డిన్నర్ సమయంలో బర్గ్ నాతో చెప్పారు
  • శుభాకాంక్షలు కూడా అందజేశారు
  • పక్షపాత మీడియాను దాటడానికి ఫేస్ బుక్ మంచి మాధ్యమం

సామాజిక మాధ్యమంలో అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఫేస్ బుక్ లో తాను అత్యంత ఆదరణ పొందిన వ్యక్తిగా ఉన్నానని చెప్పుకున్నారు. ఈ మేరకు ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ తనకు తెలిపారని చెప్పారు. ఇదే విషయాన్ని ట్రంప్ ఓ రేడియో కార్యక్రమంలో కూడా వెల్లడించారు. ‘నేను మార్క్ జుకర్ బర్గ్ డిన్నర్ కు వెళ్లాను. అక్కడ ఆయన నాతో మాట్లాడుతూ మీరు ఫేస్ బుక్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. శుభాకాంక్షలు’ అని చెప్పారన్నారు.

తాను సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ను అత్యధికంగా కోరుకుంటానన్నారు. ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా చాలావరకు పక్షపాత మీడియా సంస్థలను దాటి సమాచారాన్ని నేరుగా ప్రజలకు చేరవేయవచ్చన్నారు. సామాజిక మాధ్యమాలు ప్రస్తుత జీవనంలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. ఫేస్ బుక్ మాటటుంచితే.. ట్రంప్ కు ట్విట్టర్ లో ఏడుకోట్లమంది ఫాలోవర్స్ ఉన్నారు.