రాజధాని ప్రాంతంలో గుండెపోటుతో మహిళ మృతి

07-01-2020 Tue 19:45
  • తుళ్లూరు మండలంలో ఎర్రమ్మ అనే మహిళ కన్నుమూత
  • రాజధాని మార్పుపై ఆవేదనే కారణమంటున్న కుటుంబసభ్యులు
  • ఇప్పటికే పలువురి మృతి

ఏపీ రాజధాని అమరావతిలో మరో మరణం నమోదైంది. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మహిళ గుండెపోటుతో కన్నుమూసింది. తుళ్లూరు మండలం నేలపాడుకు చెందిన కర్నాటి ఎర్రమ్మ మృతి చెందింది. రాజధాని తరలింపు ప్రచారంతో ఆవేదనకు గురై ఎర్రమ్మ మరణించిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇప్పటికే రాజధానిలో పలువురు రైతులు, రైతు కూలీల మరణాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం తీవ్ర ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మరణాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.