తోట్లవల్లూరు పీఎస్ నుంచి నారా లోకేశ్, టీడీపీ నాయకుల విడుదల

07-01-2020 Tue 18:04
  • రాజధాని అమరావతి తరలింపుపై నిరసనకు దిగిన లోకేశ్
  • టీడీపీ శ్రేణుల ఆందోళనతో లోకేశ్, నాయకుల విడుదల
  • టీడీపీ నాయకుల అరెస్టుతో ఉద్రిక్తత

రాజధాని అమరావతి తరలింపుపై నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేశ్, ఆ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగడంతో లోకేశ్ ను, ఇతర నాయకులను పోలీసులు విడుదల చేశారు. కాగా, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత నారా లోకేశ్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలకు దిగారు. టైర్లు తగలబెట్టి నిరసనలు తెలిపారు.