ముగిసిన ఏపీ ప్రభుత్వ హైపవర్ కమిటీ భేటీ

07-01-2020 Tue 18:00
  • జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై చర్చ
  • రాజధానిపై విషయం తేల్చేందుకే...
  • సిఫార్సులపై అసెంబ్లీలో చర్చ సాగిన తర్వాతే రాజధాని నిర్ణయం  

ఏపీలో మూడు రాజధానుల అంశంపై జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ ఈ రోజు విజయవాడలో సమావేశమైంది. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలపై ఈ కమిటీ చర్చించింది. పది మంది మంత్రులు, ఆరుగురు ఉన్నతాధికారుల సభ్యులతో కూడిన కమిటీ.. ఆ రెండు కమిటీల సిఫార్సులను అధ్యయనం చేసిన తదుపరి ప్రభుత్వానికి తుది సిఫార్సులు చేయనుంది.

ఈ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చ సాగిన తర్వాత రాజధాని నిర్ణయంపై ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారమే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ.. అది నేటికి వాయిదా పడింది.