Malasiya: మలేషియాలో ‘దర్బార్’ విడుదలకు షరతు విధించిన మద్రాస్ హైకోర్టు

  • లైకా ప్రొడక్షన్స్ పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన ‘డీఎమ్ వై’
  • తమకు బకాయిపడ్డ రూ.23 కోట్లు చెల్లించాలని డిమాండ్
  • రూ.4.90 కోట్లు డిపాజిట్ చేయాలని ‘లైకా’కు ఆదేశాలు

ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ‘దర్బార్’ సినిమాకు మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. ‘దర్బార్’ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమకు బకాయిపడ్డ రూ.23 కోట్లు చెల్లించాలని మలేషియాకు చెందిన డీఎమ్ వై క్రియేషన్స్ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

ఇదే సంస్థ గతంలో తెరకెక్కించిన ‘రోబో 2.0’కు, ప్రస్తుత సినిమా ‘దర్బార్’కు తమ సంస్థ ఫైనాన్స్ చేసిందని తన పిటిషన్ లో సంస్థ పేర్కొంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. డీఎమ్ వై క్రియేషన్స్ సంస్థ పేరిట రూ.4.90 కోట్లు డిపాజిట్ చేయాలని, ఆ విధంగా చేస్తేనే మలేషియాలో ‘దర్బార్’ చిత్రం విడుదలకు అనుమతిస్తామని లైకా సంస్థను ఆదేశించింది.

More Telugu News