మా బిడ్డకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి వ్యాఖ్యలు

07-01-2020 Tue 17:17
  • నిర్భయ దోషులకు డెత్ వారెంట్ 
  • జనవరి 22న ఉరి తీయాలన్న న్యాయస్థానం
  • హర్షం వ్యక్తం చేసిన నిర్భయ తల్లి ఆశాదేవి

ఎనిమిదేళ్ల కిందట దేశ రాజధానిలో నిర్భయపై ఘాతుకానికి పాల్పడిన మానవ మృగాలకు డెత్ వారెంట్ జారీ అయింది. ఆ నలుగురు కిరాతకులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తమ బిడ్డకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

ఆ నలుగురు దుర్మార్గులకు మరణశిక్ష అమలు చేయడం మహిళలకు మరింత ఆత్మస్థైర్యం కలిగిస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఈ తీర్పు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా, తీర్పు వెలువడిన అనంతరం న్యాయస్థానం వద్ద ఆశాదేవి దంపతులు విక్టరీ సింబల్ చూపిస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు.