లోకేశ్ అరెస్ట్ వెనుక జగన్, విజయసాయిరెడ్డి హస్తం ఉంది: బుద్ధా

07-01-2020 Tue 17:05
  • నిరసన హక్కును హరించే అధికారం ఎవరిచ్చారంటూ ఆగ్రహం
  • టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని బుద్ధా డిమాండ్
  • అరెస్టులతో ఉద్యమం ఆగదని స్పష్టీకరణ

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హరించే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అరెస్ట్ వెనుక జగన్, విజయసాయిరెడ్డిల హస్తం ఉందని ఆరోపించారు. గృహ నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని భావిస్తోందని మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జగన్ పోలీసులను వాడుకుంటున్నారని విమర్శించారు.