బాలయ్య దగ్గరికి పవర్ఫుల్ స్టోరీ .. లైన్లోకి బి.గోపాల్

07-01-2020 Tue 16:29
  • బాలకృష్ణకి భారీ హిట్స్ ఇచ్చిన బి.గోపాల్
  • హిట్ కొట్టాలనే పట్టుదలతో బాలకృష్ణ 
  • రంగంలోకి బి. గోపాల్  

కొంతకాలంగా బాలకృష్ణను సక్సెస్ పలకరించడం లేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన బి.గోపాల్ తో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా సమాచారం.

ఇటీవల బాలకృష్ణ దగ్గరికి ఒక పవర్ఫుల్ స్టోరీ వచ్చిందట. ఆ కథను బి.గోపాల్ అయితేనే సమర్థవంతంగా తెరకెక్కించగలడనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ - బి. గోపాల్ మధ్య చర్చలు ఫలిస్తే, బోయపాటి తరువాత బాలయ్య చేసే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. గతంలో బాలకృష్ణ .. బి.గోపాల్ కాంబినేషన్లో 'రౌడీ ఇన్ స్పెక్టర్'.. 'లారీ డ్రైవర్' .. 'సమరసింహా రెడ్డి' .. 'నరసింహ నాయుడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.