సులేమానీ అంతిమయాత్రలో అపశ్రుతి... తొక్కిసలాటలో 35 మంది దుర్మరణం

07-01-2020 Tue 16:05
  • అమెరికా రాకెట్ దాడిలో హతమైన సులేమానీ
  • కెర్ మన్ లో అంత్యక్రియలు
  • లక్షల మంది జనం హాజరు

ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానీ అంత్యక్రియల సందర్భంగా భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 35 మంది మరణించగా, మరో 50 మంది వరకు గాయపడ్డారు. అమెరికా రాకెట్ దాడిలో హతమైన సులేమానీ అంత్యక్రియలు కెర్ మన్ పట్టణంలో జరిగాయి. సులేమానీ అంతిమయాత్రకు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. దాంతో తొక్కిసలాట ఏర్పడడంతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది. కాగా, సులేమానీ అంతిమయాత్రలో అనేకమంది పొరుగుదేశాల నేతలు కూడా పాల్గొన్నారు.