ఏపీలో ఫిబ్రవరి 4న ‘మున్సిపల్’ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు: వైసీపీ నేత ధర్మాన

07-01-2020 Tue 15:25
  • స్వయంగా సంబంధిత మంత్రే ఈ విషయం చెప్పారు
  • నాయకులు ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పనిచేయాలి
  • గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదు

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ఫిబ్రవరి 4వ తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించి, సంబంధిత మంత్రి  స్వయంగా ఈ విషయం చెప్పారని అన్నారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున నాయకులు ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తమ నాయకులకు సూచించారు.