Ala Vaikunthapuramulo: అల... వైకుంఠపురములో చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది!

  • U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
  • సినిమా నిడివి 165 నిమిషాలు
  • ట్వీట్ చేసిన గీతా ఆర్ట్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నటించిన చిత్రం అల... వైకుంఠపురములో. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ పూర్తవగా, దీనికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా నిడివి 165 నిమిషాలు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ఓ పెద్ద కుటుంబంలా సంక్రాంతి వేడుక చేసుకుందాం అంటూ గీతా ఆర్ట్స్ తన ట్వీట్ లో అభిమానులకు పిలుపునిచ్చింది. తమన్ అందించిన పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News