Pavan: రెగ్యులర్ షూటింగుకి సిద్ధమవుతున్న 'పింక్' రీమేక్

  • తెలుగులోకి 'పింక్' రీమేక్
  • ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • త్వరలో జాయిన్ కానున్న పవన్

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 'పింక్' రీమేక్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్టుగా సమాచారం. ముందుగా పవన్ పాత్రకి సంబంధం లేని ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఆ తరువాత పవన్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతాడని అంటున్నారు. హిందీలో విజయవంతమైన 'పింక్' సినిమా, ఆ తరువాత తమిళ రీమేక్ గాను సక్సెస్ ను సాధించింది. దాంతో సహజంగానే తెలుగు రీమేక్ పై అంచనాలు వున్నాయి.

More Telugu News