అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించవద్దు: రాష్ట్రపతికి లేఖ రాసిన ధర్మాన ప్రసాదరావు

07-01-2020 Tue 14:42
  • నాడు కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చించ లేదు
  • అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని కేంద్రాన్ని ఆదేశించాలి
  •  భారతదేశ మ్యాప్ లో కూడా మార్పులు చేయాలి

అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించవద్దని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. నాడు కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చించకుండానే అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు. గెజిట్ లేదా జీవో ద్వారా అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని ఈ లేఖలో కోరారు.

భారతదేశ చిత్ర పటంలో అమరావతిని రాజధానిగా గుర్తించారు కనుక మ్యాప్ లో కూడా మార్పులు చేయాలని కోరారు. రాజధానిగా అమరావతి నోటిఫై కాకుండానే అక్కడి నుంచి నాడు బాబు పాలన సాగించారని విమర్శించారు. అమరావతి రాష్ట్రానికి మధ్యస్థంగా ఉంటుందన్న వాదన సరికాదన్న విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు.