Japan: ఈ చేప ఖరీదు రూ.13 కోట్లు... జపాన్ లో సూపర్ టూనా!

  • జపాన్ సముద్రంలో అరుదైన బ్లూఫిన్ టూనా లభ్యం
  • 267 కిలోలు తూగిన భారీ చేప
  • వేలంలో కొనుగోలు చేసిన కియోషి కిమురా

ప్రపంచవ్యాప్తంగా టూనా చేపలకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ హోటళ్లలో సెలబ్రిటీ డిష్ గా టూనా చేపల మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది. వీటి సైజును బట్టి ధర పలుకుతుంటుంది. వంద కిలోల పైబడిన టూనా చేపలను వేలం వేస్తుంటారు. ఏకంగా కోట్లల్లో ధర పలికే టూనా చేపలను తినడాన్ని, తమ హోటల్ లో టూనా చేపల వంటకాలు దొరుకుతాయని చెప్పుకోవడాన్ని జపనీయులు గొప్పగా భావిస్తారు. ఈ క్రమంలో ఓ అరుదైన బ్లూఫిన్ టూనా చేప లభ్యం కాగా దాన్ని వేలం వేస్తే రూ.13 కోట్లకు అమ్ముడైంది.

జపాన్ లోని సుషీ చెయిన్ రెస్టారెంట్ల ఓనర్ కియోషి కిమురా ఈ 267 కిలోల భారీ చేపను వేలంలో దక్కించుకున్నాడు. గతేడాది ఇంతకంటే బరువైన చేపను కూడా కిమురానే కొనేశాడు. అప్పుడు దాని ధర రికార్డు స్థాయిలో రూ.22 కోట్లు పలికింది. కిమురాకు జపాన్ వ్యాప్తంగా చెయిన్ రెస్టారెంట్లు ఉన్నాయి. తన రెస్టారెంట్లలో టూనా చేపల వంటకాలకు మాంచి డిమాండ్ ఉందని, కస్టమర్ల తృప్తే తమ ధ్యేయమని కిమురా తెలిపాడు.

More Telugu News