తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రుల భేటీ

07-01-2020 Tue 14:23
  • సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో మంత్రుల భేటీ
  • ‘స్థానిక’ ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చ
  •  హైపవర్ కమిటీలో మాట్లాడే అంశాలపైనా చర్చ 

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో మంత్రులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం జరగనున్న హైపవర్ కమిటీలో మాట్లాడే అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. కాగా, సీఆర్డీఏ కార్యాలయంలో హైపవర్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చిస్తారు.