టీడీపీ నేతల గృహనిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం

07-01-2020 Tue 14:15
  • కృష్ణా, గుంటూరులలో టీడీపీ నేతల అరెస్టును ఖండిస్తున్నా
  • రైతులకు మద్దతిచ్చేందుకు వెళ్లే వారిని అడ్డుకోవడం దారుణం
  • కేసులు బనాయించడం సబబు కాదు

టీడీపీ నేతల గృహనిర్బంధంపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతల అరెస్టులను ఆయన ఖండించారు. అమరావతి కోసం వేల కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయని, రైతులు, కూలీలకు మద్దతిచ్చేందుకు వెళ్లేవారిని అడ్డుకోవడం దారుణమని, రైతులు, కూలీలు, మహిళలపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతుకూలీలకు మద్దతు చెప్పేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, పిరికి పందచర్యగా అభివర్ణించారు. వందలాది టీడీపీ నేతల అక్రమ నిర్బంధం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్టగా అభివర్ణించారు.