మూడు రాజధానుల వల్ల హింస, అభద్రత, దాడులు పెరుగుతాయి: కనకమేడల

07-01-2020 Tue 14:14
  • అమరావతిలో మీడియాతో మాట్లాడిన కనకమేడల
  • చట్టసభల్లో పోరాటం సాగిస్తామని వెల్లడి
  • చంద్రబాబు పథకాలు కనిపించకూడదని కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపణ

టీడీపీ న్యాయవిభాగం చీఫ్, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల హింస, అభద్రత, దాడులు పెరుగుతాయని అన్నారు. జగన్ మొండివైఖరి ప్రదర్శిస్తే తాము చట్టసభల్లో పోరాటం సాగిస్తామని తెలిపారు. చంద్రబాబు పథకాలు, టీడీపీ హయాంలో సాధించిన అభివృద్ధి ఏదీ కనిపించకూడదని కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రాష్ట్ర విభజన కన్నా నేడు జగన్ పాలన కారణంగానే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని కనకమేడల విమర్శించారు. విభజన చట్టాన్ని అనుసరించాలని, దాని ప్రకారం ఒకే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.