పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించారు: గల్లా జయదేవ్ ఆగ్రహం

07-01-2020 Tue 14:01
  • ఐదు గంటలుగా తన నివాసంలోనే గల్లా నిరసన
  • ఈ గందరగోళంపై పార్లమెంటులో హక్కుల నోటీసు ఇస్తా 
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతా 

పోలీసులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం ఆయనను గృహ నిర్బంధం చేయగా ఎలాగైనా తాను బయటకు వెళ్తానని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు పోలీసులు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఐదు గంటలుగా ఆయన నివాసంలోనే నిరసన తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన మరోసారి మీడియాతో మాట్లాడుతూ... పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపైకి వచ్చారని గల్లా జయదేవ్ అన్నారు. రాజధానిలో జరుగుతోన్న ఈ గందరగోళంపై పార్లమెంటులో తాను హక్కుల నోటీసు ఇస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు.