రాజకీయాల్లో పైసాకు కొరగాని వాళ్లు కూడా రంకెలేస్తున్నారు: విజయసాయిరెడ్డి

07-01-2020 Tue 14:01
  • బాబు భజన చేసుకున్నా అభ్యంతరంలేదని వ్యాఖ్య
  • రాజధానిపై అవగాహన లేకుండా మాట్లాడొద్దంటూ హితవు
  • ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దని కొందరు వాదిస్తున్నారని, అలాంటివారిలో రాష్ట్ర ప్రజలకు జరిగే మేలుకన్నా చంద్రబాబు సేవలో తరించాలన్న తాపత్రయం కనిపిస్తోందని ఆరోపించారు. రాజకీయాల్లో పైసాకు కొరగాని వాళ్లు కూడా రంకెలు వేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబుకు భజన చేయాలనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ రాజధాని అంశంలో అవగాహన లేకుండా మాట్లాడొద్దని హితవు పలికారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.