నాగబాబు వ్యాఖ్యలు.. నెటిజన్ల కామెంట్లు!

07-01-2020 Tue 13:51
  • కొన్ని సంఘటనలు ప్రస్తుతం మంచిగా అనిపించొచ్చు
  • దీర్ఘ కాలంలో చాలా చేదు ఫలితాలు రావచ్చు
  • మన చేతుల్లో లేని విషయాలను బాలెన్స్ చేసే మెకానిజం ప్రకృతికి ఉంది

కొన్ని విషయాలు బాధించినా దీర్ఘ కాలంలో మంచి ఫలితాలు రావచ్చంటూ జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. 'కొన్ని సార్లు జరిగే కొన్ని సంఘటనలు ప్రస్తుతం బాధించినా దీర్ఘ కాలంలో మంచి ఫలితాలు రావచ్చు. కొన్ని సంఘటనలు ప్రస్తుతం మంచిగా అనిపించినా దీర్ఘ కాలంలో చాలా చేదు ఫలితాలు రావచ్చు. మన చేతుల్లో లేని విషయాలను బాలెన్స్ చేసే మెకానిజం ప్రకృతికి ఉంది' అని నాగబాబు ఓ సూక్తి చెప్పారు.

నాగబాబు ట్వీట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'దేని గురించి మాస్టారు మీరు చెప్పేది? ప్రజలకు కల్యాణ్ అర్థం అయ్యే అచ్చ తెలుగులో గొంతు చించుకొని చెబితేనే అర్థం కాక ఎవడికి కావాల్సింది వాడు అర్థం చేసుకుంటున్నారు. ఇక మీరు ఈ వ్యాఖ్యలు దేనికోసం చేశారో తెలియకుండా చేస్తే ఎట్టా నాగ రాజా...!' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 'నాకు అర్థం అయింది. అమరావతి రాజధాని గురించే మీరు అన్నారు కదూ?' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.