13న కేసీఆర్‌తో జగన్ చర్చించే అంశాలు ఇవే!

07-01-2020 Tue 13:39
  • హైదరాబాద్‌లో సమావేశం
  • తాజా రాజకీయ పరిణామాలపై ముచ్చట
  • నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ

ఈ నెల 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం కానున్న విషయం తెలిసిందే. వారి సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం వారిద్దరి మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు విభజన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పలు విషయాలపై వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.