కేసీఆర్ గడ్డపై టీఆర్ఎస్ ను ఓడించడమే మా లక్ష్యం: రేవంత్ రెడ్డి

07-01-2020 Tue 13:02
  • పాలనను కేసీఆర్ గాలికొదిలేశారు
  • దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం
  • కేసులకు భయపడే ప్రసక్తే లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలనను కేసీఆర్ గాలికొదిలేశారని విమర్శించారు. కుటుంబసభ్యులకు పదవుల పంపకాలపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారని అన్నారు. పోలీసు కేసుల పేరుతో విపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని... కేసులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటామని, వారికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ అడ్డా గజ్వేల్ లో టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. కేసీఆర్ దుష్టపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తిని కలిగిస్తామని చెప్పారు.