రాజధాని పోరు: 10 రోజులుగా ఆందోళనలో పాల్గొని మరొకరి మృతి

07-01-2020 Tue 12:53
  • చిరు వ్యాపారి రామాయణపు లక్ష్మయ్య (73) మృతి  
  • కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన
  • కొనసాగుతోన్న ఆందోళనలు

అమరావతి నుంచి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో చిరు వ్యాపారి రామాయణపు లక్ష్మయ్య (73) మృతి చెందారు. పది రోజులుగా ఆయన అమరావతి రాజధాని కోసం చేస్తోన్న ఆందోళనల్లో పాల్గొంటున్నారు. తమకు అన్యాయం చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారుని కోరుతున్నారు.

ఈ రోజు ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని తరలిపోతోందని ఆయన కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన చెందినట్లు పొన్నెకల్లు గ్రామస్తులు మీడియాకు తెలిపారు. ఇప్పటికే రాజధాని పోరులో కొందరు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.