రాజధాని పోరులో ఉద్రిక్తత.. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసం.. రాళ్లు రువ్విన రైతులు

07-01-2020 Tue 12:45
  • ఎమ్మెల్యే కారును అడ్డుకున్న రైతులు
  • రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం 
  • రైతులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు

అమరావతి నుంచి రాజధానిని ఇతర ప్రాంతాలకు తరలించవద్దంటూ రైతులు చేస్తోన్న ఆందోళనల్లో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంటోంది. చినకాకానిలో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారులో వెళ్తుండగా దాన్ని రైతులు అడ్డుకొని వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఆయన కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతులు రాళ్లు రువ్వారు.

దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరుగుతోంది. రైతులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, రైతులు తమ నిరసనలపై వెనక్కు తగ్గట్లేదు.